జనత న్యూస్ బెజ్జంకి : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలో ఆదివారం బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గెలుపు కోసం అతని తనయుడు ప్రణయ్ ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటికి కార్యకర్తలు నాయకులతో కలిసి ఓటర్లను కారు గుర్తుపై ఓటు వేసి చదువుకున్న,ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న తన తండ్రి వినోద్ కుమార్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, బేగంపేట తాజా మాజీ సర్పంచ్ చింతలపల్లి సంజీవరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కచ్చు రాజయ్య, మాజీ వైస్ చైర్మన్ హనుమండ్ల లక్ష్మారెడ్డి, మాజీ డైరెక్టర్ బెజ్జంకి శంకర్, సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, గుప్త శ్రీనివాస్, సోషల్ మీడియా ఇంచార్జ్ ఎలా శేఖర్ బాబు, నాయకులు మామిడాల లక్ష్మణ్, బండి శ్రీనివాస్, కొరిమి శ్రీనివాస్, పత్రి రవి తదితరులు పాల్గొన్నారు.
తండ్రి గెలుపు కోసం విస్తృత ప్రచారం
- Advertisment -