బెజ్జంకి, జనతా న్యూస్ : బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేస్తున్న ప్రజాహిత యాత్ర శనివారం బెజ్జంకి మండలంలోని తోటపల్లి నుంచి వీరాపూర్ లక్ష్మీపూర్ బేగంపేట్, బెజ్జంకి దాచారం వివిధ గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా బేగంపేటలో మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ఆనందయ్య మఠంసందర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, కిషన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, జిల్లా నాయకులు బుర్ర మల్లేశం గౌడ్, మండల బీజేవైఎం నాయకులు గంప రవికుమార్, గ్రామ శాఖ అధ్యక్షులు జంగిటి వెంకటరెడ్డి, వడ్లూరు గ్రామ శాఖ అధ్యక్షులు పులి శ్రీకాంత్ గౌడ్, బూత్ అధ్యక్షులు బుర్ర క్రాంతి కుమార్ గౌడ్, బుర్ర నాగరాజు గౌడ్, గొడుగు సంపత్ తదితరులు పాల్గొన్నారు.
బేగంపేటలో బండి సంజయ్ కి ఘన స్వాగతం
- Advertisment -