- పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
పెద్దపల్లి,జనత న్యూస్: ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందు నుండి పోలింగ్ ముగిసే సమయం వరకు సైలెన్స్ పీరియడ్ గా పాటించాలని పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.సైలెన్స్ పిరియడ్ లో ఫలితాలను ప్రభావితం చేసే వార్తలను మీడియాలో ప్రసారం చేయడానికి వీలు లేదని, ఫలితాల వివరాలను వెల్లడించడం, పత్రికల్లో ప్రచురించడం, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయడం, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకొని వెళ్లడం నిషేధించామని అన్నారు.48 గంటల పాటు సైలెన్స్ పిరియడ్ లో ఎటువంటి ఎన్నికల ప్రచారం, ఎన్నికలకు సంబంధించి వీడియోలు,పాటలు ప్రదర్శన, రాజకీయ నాయకులు పోటీ చేస్తున్న అభ్యర్థులు,వారి అనుచరులు ఎక్కడ ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయవద్దని, ప్రచారానికి ఇతర ప్రాంతాలను వచ్చిన వారు వారి ప్రాంతాలకు వెళ్లిపోవాలని అన్నారు.సైలెన్స్ పీరియడ్ లో స్థానికులు మాత్రమే ఉండాలని, స్థానికేతరులు లాడ్జిలను ఖాళీ చేసి సొంత ప్రాంతాలకు వెళ్లిపోవాలని కలెక్టర్ తెలిపారు. రాజకీయ ప్రచారానికి సంబంధించిన బల్క్ మెసేజీ లు పంపడం నిషేధించామని తెలిపారు. సైలెన్స్ పీరియడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
ఎంసీఎంసీ అనుమతి లేనిదే ప్రకటనలు ప్రచురించరాదు
భారత ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ.మ) అనుమతి లేకుండా పోలింగ్ రోజున, అలాగే పోలింగ్ కు ఒక రోజు ముందు ఈ నెల 12, 13వ తేదీలలో ప్రింట్ మీడియాలో ఎలాంటి ఎన్నికల ప్రచార ప్రకటనలను ప్రచురించకూడదని పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.వివిధ రాజకీయ పక్షాలు, అభ్యర్థులు, ఇతరులు ఎవరైనా సరే ముందస్తుగా ఎం.సీ.ఎం.సీ. ద్వారా అనుమతి కోసం దరఖాస్తు చేసుకుని ధృవీకరణ పొందాలని పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ ఆ ప్రకటనలో తెలిపారు.