జనతా న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి గా పగ్గాలు చేపట్టిన తర్వాత అనేక మార్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్లను నియమించుకున్నారు. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారికి అవకాశం ఇచ్చారు. రేవంత్ రెడ్డి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లుగా మరో ఇద్దరి నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులను విడుదల చేసిన ప్రభుత్వం పీఆర్వోలుగా బొల్గం శ్రీనివాస్, శ్రీధర్ మామిడాలను పేర్లను ప్రకటించారు.
వీరిలో బొల్లం శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందినవారు. ఈయన 1996లో ఈనాడు రిపోర్టర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన ఈనాడు జర్నలిజం స్కూల్ కు ఎంపికయి సూర్యపేట, ఖమ్మం, అనంతపూర్ జిల్లాల్లో పని చేశారు. ఆ తరువాత సాక్షి దినపత్రిక కరీంనగర్ బ్యూరోగా పనిచేసి.. స్టేట్ బ్యూరోలో పలు ప్రభుత్వ శాఖల వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం వెలుగు దిన పత్రిక బ్యూరో చీఫ్ గా ఉన్న ఆయన ముఖ్యమంత్రి పీఆర్వోగా నియామకం అయ్యారు. గ్రామీణ ప్రాంతం నుండి సీఎంఓ పీఆర్వోగా ఎదిగిన శ్రీనివాస్ వైవిద్యమైన జర్నలిస్టుగా గుర్తింపు పొందారు. ఆయన పనిచేసిన చోట తన మార్కు రిపోర్టింగ్ చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయనతో పనిచేసిన ఆయనతో సంబంధాలు ఉన్న జర్నలిస్టు మిత్రులు కృతజ్ఞతలు తెలిపారు.