Sunday, July 6, 2025

గ్రామ ప్రథమ పౌరులకు ఘన వీడ్కోలు

జనతన్యూస్ బెజ్జంకి :బెజ్జంకి మండల వివిధ గ్రామాల సర్పంచ్ ల పదవీకాలం ముగుస్తున్నందున మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులకు స్థానిక ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్ అధ్యక్షతన సోమవారం ఘనంగా సర్పంచులకు వీడ్కోలు పలికారు. తాము డబ్బుల కోసం సంపాదన కొరకు సర్పంచిగా పోటీ చేసి గెలవలేదని, ప్రజా సేవ కోసమే పదవిలోకి వచ్చామని పలువురు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తాము చేసిన పలు అభివృద్ధి పనులకు బిల్లులు రాక అప్పులు చేసి గ్రామాలలో సిసి రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులు చేయడం జరిగిందని చెక్ పవర్ మాత్రం ఉప సర్పంచ్లతో కలిపి ఉండటంవల్ల పలు గ్రామాల సర్పంచులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు బేగంపేట సర్పంచ్ చింతలపల్లి సంజీవరెడ్డి కోరారు. ఇంకా పలు గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ తాము ప్రజాసేవలో సఫలీకృతం అయ్యాం అనే భావన తమకు ఏర్పడిందన్నారు. కొత్తగా ఏర్పడిన చిలాపూర్ పల్లి ,పెరకబండ,తలారి వానిపల్లి,బెజ్జంకి క్రాసింగ్, తిమ్మాయిపల్లి గ్రామాలకు తాము మొట్టమొదటి సర్పంచ్ లుగా ఎన్నికై గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసుకొని ఆనందంగా ఉన్నామని తెలిపారు. ఎంపీపీ నిర్మల లక్ష్మణ్ మాట్లాడుతూ సర్పంచులకు రావాల్సిన బిల్లుల విషయమై సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ రోజా శర్మకు విన్నవించి సర్పంచులకు బిల్లులు ఇప్పించే బాధ్యత తనదే అని అన్నారు. స్థానిక జెడ్పిటిసి కనగండ్ల కవితా తిరుపతి మాట్లాడుతూ రాజకీయాలలో సర్పంచ్ అనేది తొలిమెట్టు అని ఇష్టపూర్వకంగానే రాజకీయాలకు వచ్చామని మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ఎటువంటి ఆరోపణలు రాకుండా ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు వారు అభినందనీయులు అని అన్నారు. సమాజంపై ఊరిపై బాధ్యతగా సర్పంచులందరూ పనిచేశారని రాజకీయాలలో వారంతా ఇంకా ముందుకు వెళ్లాలని స్థానిక ఎంపీడీవో ధమ్మని రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్ జెడ్పిటిసి,కనగండ్ల కవిత తిరుపతి,మండల ఉపాధ్యక్షురాలు చెలుకల సబిత తిరుపతి రెడ్డి,ఎంపీడీవో ధమ్మని రాము సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చింతలపల్లి సంజీవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దుంబాల రాజమహేందర్ రెడ్డి, మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు కచ్చు చంద్రకళ రాజయ్య, మండల కో ఆప్షన్ సభ్యులు పాకాల మహిపాల్ రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,సెక్రటరీలు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page