జనత న్యూస్ బెజ్జంకి : స్నేహానికి మించిన బంధం మరొకటి లేదని నేటి యువత భావిస్తున్న ఈ రోజులలో అనేక పాఠశాలలో ఆ మధ్యకాలంలో వచ్చిన తెలుగు సినిమా” డార్లింగ్” గెట్ టుగెదర్ అనే కాన్సెప్ట్ ఆదర్శంగా తీసుకున్న నేటి స్నేహిత బృందాలు వారు పూర్వకాలం చదువుకున్న పాఠశాలలలో ఎంత బిజీ లైఫ్ అనుభవిస్తున్నప్పటికీ తమ చిన్ననాటి స్నేహితులతో కలిసి కష్టసుఖాలను పంచుకుంటూ బాల్యపు తీపి గుర్తులను స్మరించుకుంటూ చిన్నపిల్లలుగా మారిపోయి స్మతులను నెమరేసుకోవాలని అపురూప కలయికలు అనేక పాఠశాలలో ఈ రోజుల్లో సర్వసాధారణమైనవి, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్న ఈ రోజుల్లో స్నేహ బంధాన్ని ఎవరు విడదీయలేరని నిరూపిస్తున్నారు నేటి యువత, ఇందులో భాగంగానే బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలో జడ్.పి.హెచ్.ఎస్ వడ్లూరు బేగంపేట 1994-95, టెన్త్ క్లాస్ బ్యాచ్ ఆదివారం అపూర్వ సమ్మేళనాన్ని నిర్వహించుకుని అలనాటి వారి ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. చిన్నపిల్లల గా మారిపోయి ఆనాటి స్మృతులను నెమరు వేసుకుని సంతోష డోలికల్లో మునిగి తేలారు. ఈ కార్యక్రమంలో ఆనాటి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు అనంతరెడ్డి, చలమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బేగంపేట పాఠశాలలో విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
- Advertisment -