జనతా న్యూస్ బెజ్జంకి :బెజ్జంకి మండలం ముత్తన్నపేట గ్రామ అంబేద్కర్ సంఘం, మహిళ గ్రామైక్యమండలి, అంగన్వాడి, ప్రాథమిక పాఠశాల, వైద్య సిబ్బంది, డీలర్ ,ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకమండలి సర్పంచ్ కనగండ్ల రాజేశం, ఉప సర్పంచ్ జి సుధీర్ రెడ్డి ,వార్డు మెంబర్లు,& కో ఆప్షన్ సభ్యులకు వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.సర్పంచ్ కనగండ్ల రాజేశం గ్రామానికి చేసిన సేవలు ఉత్తమ గ్రామపంచాయతీగా మండల స్థాయిలో నిలిపారని అతని సేవలు మరువలేనివని సభ్యులు కొనియాడారు.అదే విధంగా ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు అందరు కలిసి గ్రామ అభివృద్ధికి కృషి చేశారని వారి సేవలు అమూల్యమైనవని సభ్యులందరూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కనకండ్ల రాజేశం, ఉప సర్పంచ్ జీ సుధీర్ రెడ్డి, వార్డు మెంబర్లు,అంబేద్కర్ సంఘ అధ్యక్షులు పొత్తూరి అంజయ్య, సెక్రటరీ రాజేందర్, అంగన్వాడి టీచర్ జి స్వరూప, ప్రధానోపాధ్యాయులు వడ్లకొండ శ్రీనివాస్ గౌడ్ ,ఆశా వర్కర్ రమ, ఏఎన్ఎం వినోద, వివోఏ అనురాధ. ఎం వనిత ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
గ్రామపంచాయతీ పాలక మండలికి వీడ్కోలు సన్మానం
- Advertisment -