న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్రం నాలుగోసారి చర్చలు జరిపింది. ప్రభుత్వం తరుపున వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్, హోంశాఖ సహాయంత్రి నిత్యానంద్ రాయ్ లు కలిసి రైతు సంఘాల నేతలతో చర్చలు జరిగపారు. ఈ చర్చల అనంతరం మంత్రి పీయూష్ గోయెల్ మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లపాటు ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించాయన్నారు. కొనుగలు చేసే పరిమాణంపై ఎటువంటి పరిమిత లేదన్నారు. ఈ ప్రతిపాదనతో పంజాబ్ లో వ్యవసాయానికి రక్షణగా ఉంటుందన్నారు. అయితే ఈ ప్రతిపాదనపై రైతులతో చర్చించనున్నట్లు రైతు సంఘం నేత శర్వాన్ సింగ్ పంథేర్ తెలిపారు. ఆ తరువాత ఓ నిర్ణయానికి వస్తాయన్నారు. అయితే ప్రస్తుతానికి ‘దిల్లి చలో’ కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు.. డిమాండ్లు పరిష్కారం కాకపోతే 21న తిరిగి ఆందోళన చేపడుతామన్నారు.
‘దిల్లి చలో’కు విరామం.. రైతుల ముందు ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు..
- Advertisment -