– ఎల్లారెడ్డిపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ కోట సతీష్ కుమార్
సిరిసిల్ల,జనతా న్యూస్: మండలంలో ఎవరైనా నిరుపేదలు ఉన్నట్లయితే వారి స్వయం ఉపాధి ద్వారా ఎదగాలనుకునే వారికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తన వంతు సహాయం అందిస్తామని ఎల్లారెడ్డిపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ కోట సతీష్ కుమార్ అన్నారు. బుదవారం ఎల్లారెడ్డి పేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోట సతీష్ కుమార్ రూ. 70000 రూపాయల విలువ గల వస్తువులను పంపిణీ చేయడం జరిగింది.మూడు కుట్టు మిషన్లను నిరుపేద మహిళలకు, నాలుగు సైకిళ్లను విద్యార్థులకు, రెండు క్రిమిసంహారక స్ప్రేయర్ డబ్బాలను నిరుపేద కౌలు రైతులకు, ట్రై సైకిల్ ను నిరుపేద దివ్యాంగురాలకు అందజేయడం జరిగింది. ఇదే కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండలంలో నూతనంగా టీచర్లుగా ఎంపికైన పదిమంది టీచర్లను ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో లయన్ కోట సతీష్ కుమార్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట లయన్స్ క్లబ్ ను రెండు తెలుగు రాష్ట్రాలలో అగ్రస్థానంలో నిలపడానికి సమిష్టిగా పని చేయాలని తద్వార అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి సహకారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పలువురు వక్తలు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఫండ్ ఎక్కడినుండో రాదని ఈ క్లబ్ సభ్యులే ఫండ్ సేకరించి సేవా కార్యక్రమాలు చేస్తారని అంతే కాకుండా ఇదే ఫండ్ ను అంతర్జాతీయ స్థాయిలో కూడ సేవా కార్యక్రమాలకు నిర్వహిస్తారని అన్నారు .ఈ కార్యక్రమంలో సెక్రటరీ నాయిని భాస్కర్ రెడ్డి, ట్రెజరర్ రావుల లింగారెడ్డి, లయన్స్ డిస్టిక్ చైర్ పర్సన్ పయ్యావుల రామచంద్రం, ఇతర లయన్స్ క్లబ్ బాధ్యులు ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, సద్ది లక్ష్మారెడ్డి, కొలనూరు శంకర్, బోయిని మహాదేవ్, రావుల మల్లారెడ్డి, పార్టీ దేవయ్య, గొర్రె మల్లేష్, పెంజర్ల రవి, డాక్టర్ అమరేందర్ రెడ్డి, రావుల ముత్యం రెడ్డి, వనం ఎల్లయ్య,పెంజర్ల రవి, పల్లి సాంబశివరావు, నాగార్జున రెడ్డి, సాదు వెంకట్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.