వేములవాడ-జనత న్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లోని ప్రముఖ పుణ్యక్షేత్ర మైన శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో దేవి నవరాత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఏడో రోజు అమ్మవారు కాలరాత్రి అలంకారణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయ ప్రధానార్యాలు అప్పాల బీమా శంకర్ శర్మ సమక్షంలో స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. పరివార దేవతార్చనలు, శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి చతుషష్టి పూజలు జరిపించారు. నాగిరెడ్డి మండపంలో గాయత్రి జపం, చండీ హోమం, గాయత్రి హవనాన్ని వేదమంత్రాలతో చేశారు అర్చకులు. మూల నక్షత్రం సందర్భంగా పుస్తక రూపిని మహా సరస్వతి పూజ, అమ్మవారికి ప్రత్యేక పూజలు కన్నుల పండువగా జరిగాయి. ఆలాగే, బాల త్రిపుర సుందరీ దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేములవాడలో దేవి నవరాత్రోత్సవాలు..

- Advertisment -