తెలుగు రాష్ట్రాల నుండి గోవాకు ఎక్కువ మంది వెళ్తున్నారట. దేశ వ్యాప్తంగా వెళ్తున్న పర్యాటకుల్లో ఈ రెండు రాష్ట్రాల నుండి వెల్తున్న వారే 20 శాతం మంది ఉంటున్నారట. ఇప్పటికే సికింద్రాబాద్ నుండి వాస్కోడగామాకు రెగ్యులర్ సర్వీసు ఉండగా..దక్షణ మధ్య రైల్వే మరో రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ నుండి బుధ, శుక్రవారాల్లో వారంలో రెండు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఉదయం పది గంటలకు సికింద్రాబాద్ నుండి బయలు దేరి తరువాతి రోజు ఉదయం ఐదు గంటల వరకు వాస్కోడిగామకు చేరుకుంటుంది. వాస్కోడిగామాలో ఉదయం 9 గంటలకు బయలు దేరి మరుసటి రోజు 6 : 20 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే..తెలంగాణలోని కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్ స్టేషన్లలో ఏసీ, స్లీపర్ క్లాస్ లకు టికెట్లు బుకింగ్ చేసుకునే అవకాశాలు కల్పించింది రైల్వే శాఖ.
గోవా పర్యాటకుల కోసం మరో రైలు..

- Advertisment -