కరీంనగర్‌కు సత్తు మల్లయ్య..
సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా నాగులు సత్యనారాయణ గౌడ్
కరీంనగర్ / సిరిసిల్ల-జనత న్యూస్
గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని 13 జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది ప్రభుత్వం. ఇందులో కరీంనగర్ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా సత్తు మల్లయ్య ( మల్లేశం), సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా నాగుల సత్యనారాయణ గౌడ్ లను నియమించింది. కరీంనగర్ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా నియామకం అయిన సత్తు మల్లయ్య సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. చొప్పదండి మండలం కొలిమికుంటకు చెందిన ఆయన గతంలో టీపీసీసీ కార్యదర్శిగా పని చేశారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన సత్తు మల్లయ్యను నియమించడం విశేషం. బీఆర్ఎస్, బీజేపీలో ఈ సామాజిక వర్గానికి చెందిన వారు రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలక పదవుల్లో ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడ గ్రంథాలయ ఛైర్మన్ పదవి బీసీలోని మున్నూరు కాపు సామాజిక వర్గానికి కేటాయించడం విశేషం.
సిరిసిల్ల గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా..
సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నాగుల సత్యనారాయణ గౌడ్‌ను నియమించింది ప్రభుత్వం. గతంలో ఆయన డీసీసీ అధ్యక్షులుగా పని చేశారు. సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవలందిస్తున్న సత్యనారాయణ గౌడ్‌ను గుర్తిస్తూ అదిష్టానం నామినేటెడ్ పదవికి ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఈ సందర్బంగా సత్యనారాయణ గౌడ్ అభిమానులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.