కరీంనగర్-జనత న్యూస్
బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. కరీంనగర్ చైతన్యపురి కాలనీ మహాశక్తి దేవాలయంలో అమ్మవారు బాల త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో గురువారం నుండి దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. భక్తులతో పాటు భవానీ దీక్ష స్వాములు సైతం పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భవానీ దీక్ష స్వీకరించిన విషయం తెలిసిందే. 11 రోజుల పాటు ఇక్కడే ఆలయంలో ఉంటూ అమ్మవారి సేవలు గడపుతున్నారు. నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు దగ్గరుండీ ఏర్పాట్లను ఆయన పర్యవేక్షిస్తున్నారు.