తిరుమల :
తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకునే ముందు అన్యమతస్తులు ఇచ్చే డిక్లరేషన్ పై ఇటీవల కాలంలో వివాదం రాజేసిన విషయం తెలిసిందే. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన చిన్న కుమార్తె తరుపున డిక్లరేషన్‌పై సంతకం చేయడం విశేషం. 11 రోజుల ప్రాశ్చిత్త దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం మంగళవారం అలిపిరి మెట్ల నుండి కాలి నడకన బయలు దేరి బుధవారం తిరుమలకు చేరుకున్నారు. ఇద్దరు కూతుళ్లతో వెల్లిన ఆయన చిన్న కూతురైన పాలేనా అంజలి క్రిస్టియన్ కావడంతో..నిబంధనల ప్రకారం డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సి వచ్చింది. పోలేనా మైనర్ కావడంతో తండ్రిగా పవన్ సంతకం చేశారు. డిక్లరేషన్‌పై వివిధ వర్గాల్లో నెలకొన్న సందేహాలను ఇలా ఏపీ డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ నివృత్తి చేశారు. పవన్ చిన్న కూతరు పోలేనా తిరుమల దర్శనానికి రావడం, ఈ పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం హోదాలో డిక్లరేషన్‌పై సంతకం చేయడం సర్వత్రా చర్చకు దారి తీసింది.
డిక్లరేషన్ తో.. వైఖరి స్పష్టం చేసిన డిప్యూటీ సీం పవన్

- Advertisment -