కర్ణాటక సీఎం సిద్ద రామయ్యపై లోకాయుక్తలో కేసు నమోదై దర్యాప్తుకు సిద్దమైన నేపథ్యంలో..సీఎం సతీమణి పార్వతి ఓ నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఓ లేఖను రిలీజ్ చేశారు. కేసుకు కారణమైన 14 ప్లాట్లను తిరిగి మూడా సంస్థకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. తన సోదరుడు కుంకుమ భరణి కింద ఇచ్చిన ఈ ప్లాట్లపై ఇంత రాద్దాంతం చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారామె. ఇనాళ్లు అధికారం అడ్డుపెట్టుకుని తామేదీ ఆశించలేదని, ఆస్తులు తృణ Êప్రాణమని లేఖలో చెప్పుకొచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉండే తమలాంటి మహిళలను వివాదాల్లోకి తీసుక రావద్దని లేఖలో పేర్కొన్నారు. అయితే..ఈ లేఖకు స్పందించిన ముడా కమీషనర్ ఆస్తులు ఎవరైనా వెనక్కి ఇస్తే తీసుకుంటామని వెల్లడిరచడం ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే ఈడీ కేసు నమోదైన నేపథ్యంలో కర్ణాటక సీఎం సతీమణి విడుదల చేసిన లేఖపై సర్వత్రా చర్చ జరుగుతుంది. దీనిపై ఈడీ అధికారులు చేయబోయే విచారణపై ఉత్కంఠ నెలకొంది. కేసుకు ప్రధాన కారణమైన ప్లాట్లను తిరిగి ఇచ్చేశాక, సంస్థ తీసుకున్నాక ఈడీ చేసే విచారణలో ఏం తేల్చనుందనేది వేచి చూడాలి.
మూడా స్కామ్ కేసు నుండి సిద్దూ బయట పడతారా..?

- Advertisment -