వాటాలు పోతున్నదెవరికి..?
బీఆర్‌ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆరోపనలపై చర్చ
కరీంనగర్-జనత న్యూస్
నగరపాలక సంస్థ కార్యాలయంలోని అకౌంట్స్ విభాగంలో భారీగా అవినీతి చోటు చేసుకుంటుందని ఆరోపించారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరింశకర్. నగరంలోని 37వ డివిజన్ మీ సేవ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. అకౌంట్స్ అధికారులు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతూ చిన్న కాంట్రాక్టర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… కరీంనగర్ నగర పాలక సంస్థ అకౌంట్స్ సెక్షన్ లో అధికారుల చేతివాటం మొదల్కెందన్నారు. అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆరోపించారు. కొత్త కమీషనర్ బాధ్యతలు తీసుకునే వరకు 15 కోట్ల 50 లక్షల రూపాయలు కాంట్రాక్టర్లకు పేమెంట్ చేశారని, 10శాతం కమీషన్ ఇచ్చిన వారికి ఇంత… 15 శాతం కమీషన్ ఇచ్చిన వారికి ఇంత అంటూ వాటాలు పంచుకున్నట్లు విమర్శించారు. గత 10 నెలల నుండి 15 శాతం వరకు ఇచ్చిన బిల్లులు చెల్లిస్తున్నారని, త్వరలో కలెక్టర్, మున్సిపల్ కమీషనర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
కాగా..ఈ ఆరోపనలపై నగరంలో సర్వత్రా చర్చ జరుగుతోంది. గతంలో స్మార్ట్‌సిటీ పనుల్లో అవక తవకలపై మాజీ మేయర్ రవీందర్ సింగ్ ద్వారా వచ్చిన హైకోర్టు ఆదేశాల మేరకు వన్‌టౌన్ పీఎస్‌లో కేసు నమోదు కాగా..తాజాగా బీఆర్‌ఎస్ నగర అధ్యక్షులు చల్లా చేస్తున్న ఆరోపనలు సర్వత్రా వివాదాస్థదంగా మారాయి. మేయర్‌గా బీఆర్‌ఎస్‌కు చెందిన సునిల్ రావు కొనసాగుతుండగా, డిప్యూటీ మేయర్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ సతీమణి ఉన్నారు. గతంలో నేరుగా మేయర్‌ను టార్గెట్ చేసి ఆరోపనలు చేసిన హరిశంకర్, ఈ సారి పరోక్షంగా ఆరోపనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
నగర పాలక సంస్థలో అవినీతి చేస్తుందెవరు..?

- Advertisment -