డీఎస్సీ ఫలితాలు ప్రకటించింది తెలంగాణ సర్కారు. ర్యాంకుల జాబితాను వెల్లడిరచించారు అధికారులు. దీంతో టీచర్లు ఎవరౌతారో తేలిపోయింది. హైదరాబాద్‌లో డీఎస్‌పీ ఫలితాలను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అభ్యర్థుల సర్టిఫికేషన్‌ను 1:3 నిష్ఫత్తిలో సర్టిఫికెట్లను అధికారులు పరిశీలిస్తారని ఆయన వెల్లడిరచారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క డీఎస్‌సీని కూడా వేయలేదని గుర్తు చేసిన ఆయన అక్టోబర్ 9న అభ్యర్థులకు నియామకపు పత్రాలను అందజేస్తామని వెల్లడిరచారు. డీఎస్‌పీ పరీక్ష నిర్వహించిన 55 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకావాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌ను ప్రక్షాలన చేశామని, త్వరలో గ్రూప్`1 ఫలితాలు కూడా వెల్లడిరచనున్నట్లు సీఎం స్ఫష్టం చేశారు.
కాగా..మార్చి 1 నోటిఫికేషన్ విడుదల చేసి, జూలై 18 నుండి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహించగా, ఇందులో 2.45 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. ర్యాంకుల ప్రకారం 11, 062 మందికి నియామకపు పత్రాలు అందజేయనుంది సర్కారు.
డీఎస్సీ ఫలితాలతో..

- Advertisment -