బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర జ్వరం, జలుబుతో బాధ పడుతున్నారు. ఇంట్లోనే చికిత్స పొందుతున్నట్లు ట్వీట్ చేశారాయన. వైద్యుల సలహా మేరకు మరో రెండు రోజులు ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే..హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో బాధితుల పక్షాన నిలబడాలని, అవసరమైన ముఖ్య నాయకత్వం అందుబాటులో ఉండాలని పిలుపు నిచ్చారు. బాధితుల పక్షాన పోరాటం చేయాలని పార్టీ నేతలకు సూచించారు. కాగా..ఒక రోజు ముందు తన అమ్మమ్మ గ్రామమైన సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాకలో సొంత ఖర్చులతో నిర్మించిన పాఠశాల భవనాన్ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలసి ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల బతుకమ్మ చీరల రద్దుపై పలు వ్యాఖ్యలు చేయగా, అధికార కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చింది. అయితే..సిరిసిల్ల పర్యటన ముగిసిన తరువాత కేటీఆర్ జ్వరంతో అస్వస్తతకు గురి అయినట్లు తెలుస్తుంది. అయినా..పార్టీ నాయకులకు సమాచార మాధ్యమాల ద్వారా కార్యక్రమాలపై పలు సూచనలు చేస్తున్నారు కేటీఆర్.
కేటీఆర్‌కు ఫీవర్, జలుబు..అయినా..

- Advertisment -