Tuesday, July 1, 2025

కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ పనులపై..

రాష్ట్ర మంత్రి పొన్నం అసంతృప్తి
డంపింగ్‌ యార్డ్‌, ఎన్జీటీ కేసుపై ఆరా..
అవినీతికి లేకుండా పనులు చేపట్టాలని సూచన
హైదరాబాద్‌ :
కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీపై సమీక్షా సమావేశంలో ప్రాజెక్ట్‌ మేనేజ్మెంట్‌ కమిటీ పనితీరు పై మంత్రి పొన్నం ప్రభాకర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ సెక్రటేరియట్‌ లోని తన ఛాంబర్‌ లో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అర్బన్‌ డెవలప్మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దానా కిషోర్‌ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ లో మొత్తం 47 పనులు ప్రారంభించగా 25 పనులు పూర్తయ్యాయని ,మరొక 20 పనులు కొనసాగుతున్నాయని, రెండు పనులు ప్రారంభం కాలేదని కరీంనగర్‌ మున్సిపల్‌ అధికారులు మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. అంబేద్కర్‌ స్టేడియంలో చేపట్టిన పెండిరగ్‌ పనులు నెల రోజుల్లోపు పూర్తి చేయాలని డెడ్లైన్‌ విధించారు. స్మార్ట్‌ సిటీ లో భాగంగా కరీంనగర్‌ లో 27 స్కూల్‌ పనుల్లో ఎన్ని పూర్తయ్యాయి.. ఏ మేరకు మౌళిక వసతులు కల్పించారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్‌ సిటీ లో భాగంగా అభివృద్ధి చేసుకున్న సర్కస్‌ గ్రౌండ్‌ నగర ప్రజలకు ఎంత వరకు ఉపయోగపడుతుందని, దాని మెయింటెన్స్‌కు వస్తున్న ఆదాయం తదితర వాటిపై ఆరా తీశారు. జంక్షన్‌ లు , ఓల్డ్‌ పవర్‌ హౌజ్‌ జంక్షన్‌ ,హెచ్‌ కెఆర్‌ జంక్షన్‌ , సదా శివంపల్లి జంక్షన్‌ , తెలంగాణ చౌక్‌ తదితర వాటిపై ప్రాజెక్టర్‌ ద్వారా వీక్షించారు. కొన్ని జంక్షన్‌ లకు అనుమతి లేకుండా ఇష్టారీతిన అంచనా విలువ పెంచారని వాటి వివరాలు సేకరించాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీ దానా కిషోర్‌ ను ఆదేశించారు.
డంపింగ్‌ యార్డు తీసుకున్న నిర్ణయం ?
నగరంలో ఉన్న డంపింగ్‌ యార్ట్‌ విషయంలో పీఏంసీ పై మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన విధానాలు పాటించకపోవడం వల్లే డంపింగ్‌ యార్డ్‌ మంటలు అంటుకొని కరీంనగర్‌ పట్టణం పొగ భారిన పడుతుందని తెలిపారు. డంపింగ్‌ యార్డ్‌ పై ఏం చేస్తే బాగుంటదన్న దానిపై అధికారుల తో చర్చించారు. కరీంనగర్‌ లో నిర్మించిన కమాండ్‌ కంట్రోల్‌ లో సిటీ నుండి అనుసంధానం పై, వాటి వినియోగంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధోభీఘట్‌ పెండిరగ్‌ ఎలక్ట్రిక్‌ కనెక్షన్‌ లపై సూచనలు చేశారు. ఎన్జీటి కేసు డిసెంబర్‌ వరకు ఉండడంతో దానిపై ఏం చేస్తే బాగుంటదని అధికారులతో చర్చించారు. ప్రస్తుతం కడుతున్న కట్టడాలు త్వరలోనే విజిట్‌ చేస్తానని ఎక్కడ నిర్లక్ష్యం కనిపించిన సహించేది లేదని హెచ్చరించారు.
మానేరు రివర్‌ ఫ్రంట్‌ డెవలప్మెంట్‌ పై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్‌ లో మంజూరైన ఇప్పటి వరకు చేసిన పనులు, ఇంకా చేయాల్సినవి బ్యూటిఫికేషన్‌ తదితర వాటిపై ఆరా తీశారు. రైలింగ్‌ ,ల్యాండ్‌ స్కెపింగ్‌ ,మ్యూజికల్‌ పార్క్‌ తదితర యానిమేషన్‌ చిత్రాలను చూశారు.మానేరు రివర్స్‌ ఫ్రంట్‌ డెవలప్మెంట్‌ లో కేబుల్‌ బ్రిడ్జి బయట వరకు ఉండే నీటి నిల్వ తదితర వాటిపై సూచనలు చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అర్బన్‌ డెవలప్మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దాన కిషోర్‌, మున్సిపల్‌ డిప్యూటీ సెక్రటరీ ప్రియాంక , కరీంనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ భాజ్పెయ్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ , ఇరిగేషన్‌ ,టూరిజం ,మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page