భార్య సరదా కోసం ద్వీపాన్నే కొనేశాడు ఓ వ్యాపార వేత్త. సౌదీకి చెందిన జమాల్ అల్ నదాశ్ అనే పెద్ద వ్యాపార వేత్త తన భార్య సరదా తీర్చేందుకు హిందు మహాసముద్రంలోని ఓ ద్వీపాన్ని రూ. 418 కోట్లకు కోనేశాడట. ఇది సోషల్ మీడియాలో ట్రెండిరగ్‌లోకి వచ్చింది. బికినీ ధరించి బీచ్‌లో తిరగాలనే భార్య కోరికను..ఇలా తీర్చాడు జమాల్. బీచ్‌లో స్వేచ్ఛగా ఎవరి కంట పడకుండా ఉండేందుకు ఏకంగా ద్వీపాన్నే కొనడం ఆశ్చర్యం కల్గిస్తుంది. భార్య సరదా కోరిక ఏకంగా ద్వీపాన్నే కొనేలా చేసింది. కొనుగోలు చేశాడు సరే..తన భార్య ఆ సరదా తీరాక.. ఆ వ్యాపార వేత్త ద్వీపాన్ని ఏం చేస్తాడు..తిరిగి అమ్మేస్తాడా..ఆక్కడే నివాసం ఉంటాడా..? ఇలా అనేక కొంటె సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
సరదా కోసం ద్వీపాన్నే కొనేశాడు..

- Advertisment -