ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడ-జనత న్యూస్
నిరుద్యోగ యువతీ యువకులకు ప్రముఖ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 28న శనివారం సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాలులో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు నెలకు రూపాయలు రూ. 12 వేల నుంచి 40 వేల రూపాయల వరకు వేతనం వచ్చే వివిధ కంపెనీల్లో నియామకపు ఇంటర్వూలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందులో హైదరాబాద్ , కరీంనగర్ , సిరిసిల్ల, వేములవాడ కు చెందిన ప్రముఖ కంపనీల ప్రతినిధులు ఇంటర్వూలు నిర్వహిస్తారని వివరించారు. జిల్లాలోని అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ కాఫీలతో రుద్రంగిలోని రెడ్డీస్ ఫంక్షన్ హాల్‌కు శనివారం ఉదయం 10.00 గంటలకు తరలి రావాలని పిలుపు నిచ్చారు. మరిన్ని వివరాలకు 99633 57250, 98853 46768. నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
28న రుద్రంగిలో మెగా జాబ్ మేళా

- Advertisment -