ఏపీ మాజీ సీఎం 27న తిరుమల వెళ్లనున్న సందర్భంగా అన్యమత..చర్చ హాట్ టాఫిక్‌గా మారింది. దీనిపై వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని ఎన్డీఏ నేతలు డిమాండ్ చేస్తున్నారు. శ్రీ వారి దర్శనానికి ముందు డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పూరందేశ్వరి, ఎన్డీఏ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 2012లో శ్రీవారి దర్శనం చేసుకున్న నేపథ్యంలో వైఎస్ జగన్‌ను టీటీడీ అధికారులు డిక్లరేషన్ అడిగితే..2009లో ఇచ్చినట్లు అప్పుడు చెప్పారని అప్పటి ఈవో సుబ్రమాణ్యం చెప్పినట్లు వచ్చిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం నేపథ్యంలో వైఎస్‌ఆర్ సీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల దర్శనం కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 27న తిరుమలకు వెళ్లి 28న దర్శనం చేసుకోనున్న నేపథ్యంలో అన్యమత డిక్లరేషన్ చర్చ సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
మాజీ సీఎం జగన్ డిక్లరేషన్ ఇస్తారా..?

- Advertisment -