బీసీ కుల గణనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఆలస్యమైతే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘ నిధులు నిలిచి పోయే ప్రమాదం ఉన్నందున సాధ్యమైనంత త్వరలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా కార్యచరణకు చేపట్టింది. బీసీ కమీషన్ ఛైర్మన్ నిరంజన్, కమీషన్ సభ్యులతో సమావేమై శ దిశా నిర్ధేశం చేసిన సీఎం..వారికి పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన చేపట్టేందుకు అనుసరించాల్సిన పద్దతులపై సర్కారు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. యుద్ద ప్రాతిపదికన కుల గణన చేపట్టి, సుప్రిం కోర్టు గైడ్‌లెన్స్ ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం కంటే మించకుండా బీసీ రిజర్వేషన్లు పెంచే దిశగా సర్కారు నిర్ణయం తీసుకోనుంది. బీసీలకు రిజర్వేషన్లు పెంచితే, ఏ ఏ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు తగ్గుతాయనే దానిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
బీసీ కుల గణనపై రేవంత్ సర్కారు ఫోకస్

- Advertisment -