హైదరాబాద్ :
ఉమ్మడి రాష్ట్రంలో 2008 నుండి పోరాడుతున్న డీఎస్‌సీ బాధితులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ ప్రకటించింది. అప్పటి డీఎస్‌సీలో నష్టపోయిన అభ్యర్థులను ఎస్జీటీలుగా నియమించుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో సుమారు 2,367 మంది నిరుద్యోగులు లబ్ధి పొందనున్నారు. రేవంత్ సర్కారు తీసుకున్న నిర్ణయంతో నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో అధికంగా, మిగతా జిల్లాల్లో కూడా బాధితులకు మేలు జరుగనుంది. వీరందరినీ ఎస్జీటీలుగా కాంట్రాక్టు పద్దతిలో విధుల్లోకి తీసుకోనున్నారు. విద్యాశాఖ వెరిఫికేషన్ పత్రాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచగా..వాటిని డౌన్‌లోడ్ చేసుకుని ఈ నెల 27 నుండి అక్టోబర్ 5వ వ తేదీ వరకు నిర్వహించే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. తాజాగా నియామకం పొందే వారికి నెలకు రూ. 31 వేల చొప్పున ప్రభుత్వం వేతనం చెల్లించనుంది.
డీఎస్‌సీ 2008 బాధితులకు గుడ్ న్యూస్

- Advertisment -