హైదరాబాద్ :
తెలంగాణ టూరిజం మాజీ ఎండీ బోయినపల్లి మనోహర్ రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టినట్లు సమాచారం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్దంగా దగ్గరి వారికి పలు కాంట్రాక్టు పనులు కట్టబెట్టినట్లు గుర్తించిన రేవంత్ సర్కారు..లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. పాలిటెక్నిక్ డిప్లోమో పూర్తి చేసిన ఆయన నకిలీ సర్టిఫికెట్‌తో ఎండీగా ఉద్యోగోన్నతి సాధించినట్లు ఆరోపనలున్నాయి. నాగార్జున సాగర్‌లో ఎస్టీ మహిళపై లైంగిక వేదింపుల ఆరోపన నేపథ్యంలో కేసు కూడ నమోదైంది. దీంతో ఆయన్ను ఎండి పదవి నుండి తొలగించారు. ఏకో టూరిజం పేరుతో తన అనునీయులకు కాంట్రాక్టులు కట్టబెట్టి రూ. కోట్లాదిగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు ప్రభుత్వం గుర్తించి విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తుంది.
టూరిజం మాజీ ఎండీపై విచారణ ?

- Advertisment -