హైదరాబాద్ :
అటు రైతులకు, ఇటు వైట్ రేషన్ కార్డు దారులకు ఉపయోగ పడేలా చర్యలకు ఉపక్రమిస్తుంది కాంగ్రెస్ సర్కారు. ఈ వానాకాల పంట దాన్యం కొనుగోళ్లలో సన్న వడ్లకు రూ. 500 బోనస్ చెల్లించేందుకు నిర్ణయించడం వల్ల రైతులకు అదనపు లబ్ధి చేకూరనుంది. కాంగ్రెస్ మెనిఫెస్టోలో ప్రకటించినట్లు క్వింటాలు ధాన్యంపై బోనస్ అమలు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 36.80 లక్షల ఎక రాల్లో సన్న రకాలు సాగు చేయగా.. 88.00 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ధాన్యాన్ని మరపట్టి రేషన్ కార్డుల ద్వారా పేదలకు బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ విషయమై రాష్ట్ర సివిల్ సప్లైశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం పట్ల ప్రజల్లో సానుకూలత వచ్చే అవకాశాలున్నాయి. రైతు బంధు విధి విధానాలు ఖరారు కాక పోవడంతో ఈ ఖరీఫ్‌కు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయక పోయినప్పటికీ, సన్న రకాలు పండిరచిన రైతులకు క్వింటాలుపై రూ. 500 బోనస్ రానుంది.
అటు రైతులకు..ఇటు రేషన్ కార్డు దారులకు..

- Advertisment -