రూ. 60 కోట్ల నిధుల విడుదల..
రాష్ట్ర మంత్రి పొన్నం వెల్లడి
హుస్నాబాద్-జనత న్యూస్
హుస్నాబాద్ అసెంబ్లీ నియోజక వర్గానికి రూ. 60 కోట్ల నిధులు విడుదలైనట్లు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. నియోజక వర్గ పరిధిలోని సైదాపూర్, చిగురు మామిడి. బీమదేవర పల్లి, ఎల్కతుర్తి, కోహెడ మండలాల్లోని ఆయా గ్రామాల్లో అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆయా ప్రాంతాల్లో అభివృద్ది పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రోడ్లు, హైలేవల్, లో లేవల్ వంతెనలు, కల్వర్టులు, కాజ్‌వేలు, శ్మశాన వాటికల్లో అభివృద్ధి పనులు, వసతుల ఏర్పాటుకు ఈ నిధులు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. నియోజక వర్గంలో ఇంకా పెండిరగ్ పనులకు రెండో విడుతలో నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఆయా శాఖల మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
హుస్నాబాద్ నియోజక వర్గ అభివృద్ధికి..

- Advertisment -