మానేరు విద్యా సంస్థల ఛైర్మన్ కడారి
కరీంనగర్-జనత న్యూస్
రానున్న కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో తాను పోటీలో ఉంటానని ప్రకటించారు మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి. నగరంలోని ఓ ప్రయివేటు హోటల్‌లో ఆయన మీడియాకు వివరాలు వెల్లడిరచారు. తనకు తెలంగాణ జూనియర్, డిగ్రీ కళాశాలల సంఘాలు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డిలు మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు. బిజెపి టిక్కెట్‌తో నైనా, పార్టీ టిక్కెట్ ఇవ్వకున్నా ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తాన్న ధీమా వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి జరిగే శాసనమండలి ఎన్నికల్లో ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా ఓటు వేసే హక్కును భారత ఎన్నికల సంఘం కల్పించిందని, ప్రైవేట్ టీచర్లు అధిక సంఖ్యలో ఉన్నారని తెలిపారు. సెప్టెంబర్ 30 నుంచి ఉపాధ్యాయ నియోజకవర్గానికి ప్రైవేట్ ఉపాధ్యాయులను ఓటర్లుగా చేర్పించేందుకు ఫారం 19ని పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, సరిపడా సబ్జెక్టు టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు అవకాశం ఇస్తే ప్రభుత్వ విద్యా సంస్థల్లో మంచి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అదే విధంగా బడ్జెట్‌లో ప్రైవేటు పాఠశాలలకు విద్యుత్ సరఫరా, ఆస్తిపన్నులో ప్రభుత్వం కొంత రాయితీలు కల్పించాలన్నారు. ప్రభుత్వం జిఒ 317 సమస్యను పరిష్కరించాలని, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పెండిరగ్‌లో ఉన్న నాలుగు డిఎలను వెంటనే విడుదల చేయాలని అన్నారు.
బీజేపీ మద్దతుతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ

- Advertisment -