బంగ్లాపై భారత్ ఘన విజయం
తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌పై 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, రెండు మ్యాచ్‌ల సీరీస్‌లో 1`0 ఆధీక్యంలో నిలిచింది. భారత్ తోలి ఇన్నింగ్‌లో 376 స్కోర్ చేసి ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్‌లో నాలుగు వికట్లకు 287 పరుగులు చేసి డిక్లెర్డ్ చేసింది. బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్‌లో 149 స్కోర్‌కే ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్‌లో 234 పరుగులకు ఆలౌట్ కావడంతో 280 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఇందులో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లను తీయగా, రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసుకున్నాడు. బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో 127 బంతుల్లో 82 పరుగులు చేసి టాప్ స్కోర్ చేశాడు. రిషబ్ పంత్ (109), శుభ్‌మన్ గిల్ (119) జంట సెంచరీలతో 514 పరుగుల ఆధిక్యంతో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో ఆదిఖ్యాన్ని ప్రదర్శించారు.
అశ్విన్ మాయా జాలం..షుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్ చతురత..

- Advertisment -