తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రియాల్టీ షో బిగ్‌బాస్ ! రోజువారి భాగంలో కొన్ని సన్ని వేషాలు మాత్రమే ప్రేక్షకులకు చూపిస్తున్నారు. ఎపిసోడ్‌ను రక్తి కట్టించే సన్నివేషాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్వాహకులు. గతంలో సోనియా`పృద్వి..తాజాగా అభయ్ పైనే అందరి దృష్టి పేడేలా సన్నివేషాలను చూపించారు. అయితే నెగెటీవ్ సన్నివేషాలైనప్పటికీ అభయ్ తీరుపై సర్వత్రా ఉత్కంఠ రేపింది. బిగ్‌బాస్‌లోని గేమ్స్, నిబంధనలపై ప్రేక్షకుల్లో పాజిటీవ్, నెగెటీవ్ అభిప్రాయాలుంటాయి. ఎప్పుడూ పాజిటీవ్‌నే కాకుండా నెగెటీవ్ అభిప్రాయాలనూ చూపించడం వల్ల బిగ్‌బాస్ షో బయాస్‌గా ఉండదనే సంకేతాలిచ్చినట్లుగా దీని ద్వారా తెలుస్తుంది. హౌజ్‌లో బిగ్‌బాస్‌ను అంతగా తిట్టినప్పటికీ, క్షమించి ఆటలో కొనసాగించడం ప్రేక్షకుల్లో ఉత్కంఠ, ఆసక్తి రేపింది. అయితే ఏ నిర్ణయమైనా బిగ్‌బాస్‌దే ఫైనల్, అందరూ కట్టుబడి ఉండాల్సిందే నని అభయ్ రూపంలో ప్రేక్షకులకు చూపించినట్లు దీని ద్వారా తెలుస్తుంది.
బిగ్‌బాస్‌లో అభయ్ పైనే అందరి దృష్టి

- Advertisment -