ఎస్వీజేసీలో రాంనగర్ బన్నీ సినిమా యూనిట్
కరీంనగర్-జనత న్యూస్
నగరంలో సందడి చేసింది రామ్‌నగర్ బన్నీ సినిమా యూనిట్. వావిలాల పల్లి ఎస్వీజేసీ కాలేజీ క్యాంపస్‌లో హీరో`హీరోయిన్‌లు సందడి చేశారు. కళాశాలలోని విద్యార్థులతో ముచ్చటించారు. తమ సినిమా లోని సన్నివేశాలు, సరదాలను కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ కి సాంగ్ కి మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందేనని చీఫ్ కోఆర్డినేటర్ నలుమాచు చంద్ర శేఖర్ తెలిపారు. కళాశాల నిర్వాహకులు మాట్లాడుతూ..రాంనగర్ బన్నీ సినిమా యూనిట్ సభ్యులు తమ విద్యా సంస్థలకు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా 100 డేస్ ఫంక్షన్ కూడా కరీంనగర్ లో చేసుకోవాలని ఆ విజయోత్సవ సంబరాల్లో అందరూ పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూడాలని కోరారు. హీరో చంద్రహాస్, దర్శకుడు శ్రీనివాస్ మహత్ , నిర్మాత మలయజ ప్రభాకర్ , హీరోయిన్స్ విస్మయశ్రీ, రిచా జోషి , అంబికా వాణి టీమ్ సభ్యులు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్విజేసి విద్యాసంస్థల డైరెక్టర్ లు ఊట్కూరి మహిపాల్ రెడ్డి, కాంతాళ రామ్ రెడ్డి, సింహాచలం హరికృష్ణ, వెంకట వరప్రసాద్, వంగల సంతోష్ రెడ్డి, నలుమాచు రాణి చంద్రశేఖర్, రజిత, కృష్ణమూర్తి-కరుణ, పద్మ, శైలజ, పద్మారెడ్డి, సతీష్ ,చిత్ర యూనిట్ సభ్యులు హాయ్ తాత పాల్గొన్నారు.
నగరంలో సినీ నటుల సందడి

- Advertisment -