అమృత్ పథకంలో అవినీతి జరిగిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపనలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రూ. 8, 888 కోట్ల అవినీతిపై చర్చకు ఎక్కడికైనా సిద్దమేనని, నిరూపించకుంటే రాజీనామాకు సిద్దమా..? అని కేటీఆర్‌కు ఆయన సవాల్ విసిరారు. కేటీఆర్ నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, లేని పక్షంలో కేటీఆర్ స్పీకర్ పార్మట్‌లో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తన సవాల్‌ను స్వీకరించుకుంటే పరువు నష్ట దావా వేస్తామని కేటీఆర్‌ను హెచ్చరించారు మంత్రి పొంగులేటి. అమృత్ టెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి బావ మరిదికి కాంట్రాక్టు కట్టబెట్టారని, భారీ అవినీతి జరిగిందని కేంద్ర మంత్రులు మనోహర్‌లాల్ ఖట్టర్, టోచన్ సాహులకు కేటీఆర్ లేఖ రాసిన నేపథ్యంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి ఇలా తీవ్రంగా స్పందించారు. ఈ సవాల్‌ను కేటీఆర్ స్వీకరిస్తారా..లేదా అనేది వేచి చూడాలి.
అవినీతి ఆరోపనలపై చర్చకు సిద్దమేనా..?

- Advertisment -