చాలా కాలం తరువాత విమర్శనాస్త్రాలు
హైదరాబాద్ :
కాంగ్రెస్ సర్కారుపై కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. చాలా కాలంగా రాజకీయ ఆరోపనలకు దూరంగా ఉన్న ఆయన..తాజాగా రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ఆరోపనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేల హక్కులు కాల రాస్తుందని, నియోజక వర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా కాంగ్రెస్ నాయకులే పంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీ ఛైర్మన్ నియామక విషయంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు గంగుల కమలాకర్. హరీష్ రావును నియమించకుండా, జాబితాలో లేని అరికెపుడి గాంధీని ఎలా నియమిస్తారని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీల పేర్లు అసెంబ్లీ స్పీకర్ కు ఇచ్చిమని, అందులో ఎవరినీ నియమించక పోవడంపై హై కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. తన నియోజక వర్గంలో ఓడి పోయిన నాయకుడికి కూడా నిధులు కేటాయిస్తున్నారని పురుమల్ల శ్రీనివాస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్.
కాంగ్రెస్ సర్కారుపై ఎమ్మెల్యే గంగుల ఫైర్

- Advertisment -