దసరా కానుక ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్
హైదరాబాద్ :
సింగరేణి కార్మికులకు దసరా కానుక ప్రకటించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ సారి సింగరేణి లాభాల్లో 33 శాతం కార్మికులకు బోనస్‌గా పంచుతామని ఆయన తెలిపారు. దీంతో తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధిలో గల 17 ఓపెన్ కాస్టులు, 22 అండర్ గ్రౌండ్స్‌లో పని చేస్తున్న సుమారు 42 వేల మంది కార్మికులకు బోనస్ లభించనుంది. ఒక్కొక్కరికి రూ. లక్షా 90 వేల చొప్పున బోనస్‌ను ఇస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. గతంలో కన్నా రూ. 20 వేలు అధికంగా ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. దసరాకు ముందుగానే బోనస్ చెల్లిస్తామన్న సీఎం..మొత్తం రూ. 796 కోట్లు అందించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.