మళి తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు
హైదరాబాద్ :
మళ్లీ తెరపైకి ఫోన్ ట్యాంపింగ్ కేసు వచ్చింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న కేసు విచారణ ఇప్పుడు కొలిక్కి రానున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తి మేరకు ఇద్దరికి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు సీబీఐ అంగీకరించింది. త్వరలో ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు రెడ్ కార్నర్ అందే అవకాశాలున్నాయి. ఈ కేసులో కీలక నిందితులుగా మాజీ ఓఎస్‌డీ ప్రభాకర్ రావు, ఓ మీడియా ఛానల్ నిర్వాహకుడు శ్రావన్ రావులు అమెరికాలో ఉన్నట్లు సమాచారం. వారిని పట్టుకోవాలంటే సీబీఐ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే..రెడ్ కార్నర్ నోటీసులకు వీరిద్దరు స్పందిస్తారా..లేక అక్కడి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా..అనేది తేలాల్సి ఉంది. అక్కడి న్యాయస్థానంలో ఊరట లభించకుంటే..హైదరాబాద్ పోలీసులకు సరెండర్ కావాల్సిందే నని న్యాయ నిపుణులు చెబుతున్నారు. వారిని అరెస్టు చేసి విచారిస్తే..వారి వాగ్మూలంలో వెల్లడయ్యే విషయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ప్రభాకర్ రావు పోలీసులకు చిక్కుతాడా ?

- Advertisment -