రాష్ట్ర వ్యాప్తంగా కీలక శాఖల్లోని వివిధ విభాగాల్లో సేవలందిచే ‘మీ`సేవ’ ఎప్పుడూ లేని విధంగా పది రోజులుగా మొరాయిస్తుండడం..అటు వినియోగ దారులు, అధికారులు, ఇటు నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న సేవలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేకలేకనో, లేక బ్యాకప్ పెట్టుకోక పోవడం వల్లనో ..కారణం ఏదైనా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. మొత్తంగా 38 శాఖల్లోని 204 రకాల పౌర సేవలు నిలిచి పోతున్నాయి. మారుతోన్న కాలానుగునంగా సేవలు విస్తరించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, అవసరమైతే ఏజెన్సీలను మార్చడం లాంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 1.58 కోట్ల సేవలు పోందారంటే..మీసేవ ప్రాధాన్యత ఎంతుందో అర్థం అవుతుంది. సర్వర్ తదితర సమస్యల వల్ల సెప్టెంబరు 19 రోజుల్లో కేవలం 7.64 లక్షలు మాత్రమే సేవలు పొందారంటే..వినియోగ దారులు ఇబ్బందులు ఎంత మేరకు ఉన్నాయో తెలుస్తుంది. ఇప్పటికైనా మీ`సేవను ప్రక్షాళణ చేస్తారా..లేక తొలగించి కొత్త సేవ సంస్థను తీసుకొస్తారా అనేది వేచి చూడాలి.
‘మీ -సేవ’ సేవలు ఇక ఇంతేనా..?

- Advertisment -