కరీంనగర్-జనత న్యూస్
జాతీయ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈనెల 28 న జాతీయ లోక్ అదాలత్ లు నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి వెంకటేష్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్ లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 23 వేల పైగా కేసులు కోర్టుల్లో పెండిరగ్ లో ఉన్నాయని, వాటిలో లోక్ అదాలత్ లలో రాజీ చేయదగిన 3000 కేసులను గుర్తించి వాటిలోని 2051 కేసులలో కక్షిదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ లోక్ అదాలత్ లో రాజీ చేయదగిన సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ, బ్యాంకు, చెక్ బౌన్స్, మోటార్ ప్రమాద కేసులతో పాటు కోర్టుకు రాని కేసులను కూడా పరిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను దీనిలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్లు పరిష్కరిస్తారని, మొదటిసారిగా కన్జ్యూమర్ ఫోరంలో పెండిరగ్ లో వున్న కేసులను కూడా ఈ లోక్ అ దాలత్ లో పరిష్కరిస్తామని తెలిపారు. లోక్ అదాలతులలో రాజీ ద్వారా కేసులు పరిష్కరించుకుంటే అప్పీలు ఉండదని సమయం, డబ్బు వృధా కాకుండా ఉంటుందని తెలిపారు. రాజీయే రాజమార్గంగా కక్ష దారులు ఈ లోక్ అదాలత్ లను సద్వినియోగపరుచుకొని వారిపై కేసులను పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
28 న జాతీయ లోక్ అదాలత్

- Advertisment -