నల్గొండ బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసు కూల్చివేతకు ఆదేశాలు
హైకోర్టు తీర్పుతో గులాబీ నేతల నారాజ్
హైకోర్టు :
హైకోర్టులో బీఆర్‌ఎస్ పార్టీకి చుక్కెదురైంది. నల్గొండ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేయాలని మున్సిపల్ శాఖకు ఆదేశాలిచ్చింది న్యాయస్థానం. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు బీఆర్‌ఎస్ నేత. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని ప్రశ్నించింది. కట్టకముందు మున్సిపల్ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉందని గుర్తు చేసిన హైకోర్టు.. కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని పిటీషనర్‌ను ప్రశ్నించింది. నల్గొండ బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు రూ. లక్ష నష్ట పరిహారం చెల్లించాలని బీఆర్‌ఎస్ పార్టీని ఆదేశించింది న్యాయస్థానం. గతంలో..ఇదే బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేయాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో కోర్టు మెట్లెక్కారు పార్టీ నాయకులు.