మిలాద్-ఉన్-నబీని ఘనంగా జరుపుకోవాలి
కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ వెలిచాల
కరీంనగర్-జనత న్యూస్
శాంతి, కరుణ, సోదరభావాన్ని చాటి చెప్పే మహమ్మద్ ప్రవక్త బోధనలు యావత్ మానవాళికి దిక్సూచి అని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. సోమవారం మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఉన్- నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మహమ్మద్ ప్రవక్త బోధించిన సబ్ర్ (సహనం), సిద్‌క్ (సత్యనిష్ట), తహారత్ (పవిత్రత), జకాత్ (సహాయం), రహ్మా (దయ) అనే పంచ సూత్రాలు మానవీయ జీవితానికి బాటలు వేస్తాయని పేర్కొన్నారు. ప్రతీ ముస్లీం సోదరుడు ఆ ప్రవక్త సూచించిన సన్మార్గాలను పాటిస్తూ, పవిత్ర మిలాద్-ఉన్-నబీ పండగను ఇంటింటా భక్తిశ్రద్ధల మధ్య, ఆనందో త్సవాలతో జరుపుకోవాలని ఆయన సూచించారు. ప్రవక్త చెప్పిన శాంతి మార్గమే ప్రతి ఒక్కరికీ ఆచరణీయమని, వాటికి అనుగుణంగా ముందుకెళ్లాలని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.
ప్రవక్త బోధనలు మానవాళికి దిక్సూచి

- Advertisment -