గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
పర్యాటకులను కనువిందుకు చేస్తున్న దృష్యాలు
కరీంనగర్-జనత న్యూస్
పర్యాటక శోభ సంతరించుకుంది కరీంనగర్ దిగువ మానేరు ప్రాజెక్టు. ఎల్‌ఎండీ పూర్తి స్థాయి నీటి మట్టం 24 టీఎంసీలు కాగా..ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిండింది. జలాశయం నిండడంతో మిడ్ మానేరు ప్రాజెక్టు నుండి ఎల్‌ఎండీ లోకి వస్తున్న నీటిని దిగువకు వదులాల్సి వచ్చింది. దీంతో రిజర్వాయర్ వద్ద రెండు గేట్లు ఎత్తి మూడు వేల క్యూసెక్కుల నీటిని వదిలారు అధికారులు. మిడ్ మానేరు నుండి మూడు వేల క్యూసెక్కుల నీరు ఎల్‌ఎండీలోకి వస్తుండగా..దిగువ మానేరు ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా దిగువకు వదిలారు. దీంతో మానేరు ప్రాంతమంతా జలకళను సంతరించుకుంది. చాలా కాలం తరువాత గేట్లు ఎత్తివేయడంతో పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ దృష్యాలను చూసేందుకు ప్రజలు తరలి వెళ్తున్నారు. అయితే ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. రెవిన్యూ , పోలీస్ శాఖల అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతం లోకి పశువులు , గొర్లు వెళ్లకుండా, ప్రమాదాలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేశారు.
ఎల్‌ఎండీకి పర్యాటక శోభ

- Advertisment -