ప్రధాన మంత్రి రేసులో ఉంటే తనకు మద్దతిస్తామని ఓ నేత చెప్పారని..కేంద్ర మంత్రి గడ్కరీ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చకు తెర లేపాయి. తన పార్లమెంటు అయిన నాగపూర్‌లో జరిగిన జర్నలిజం అవార్డుల ప్రధానోత్సవంలో కేంద్ర మంత్రి గడ్కరి చేసిన వ్యాఖ్యలు..బీజేపీతో పాటు ఇతర పార్టీల్లోనూ ఆసక్తి రేపాయి. అయితే..ఆ ఆఫర్‌ను తాను తిరస్కరించానని, పార్టీకి విధేయుడనై ఉంటానని, తనకు విశ్వాసం ముఖ్యమైందని గడ్కరీ పేర్కొన్నారు. అయితే..ప్రదాని రేసులో ఉంటే మద్దతిస్తామని ఆఫర్ ఇచ్చిందెవరనేది కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పలేక పోయారు. రాజకీయాలు, జర్నలిజంలో నైతిక విలువలు ఉండాలని సూచించిన ఆయన..నిజాయితీతో వ్యతిరేకించే వ్యక్తిని గౌరవించాలనేది తన ఉద్ద్యేశమని తెలిపారు. ప్రస్తుత రాజకీయాలతో పాటు జర్నలిజంలో నిజాయితీతో ఉండే వ్యక్తులు అరుదని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పడం ఆలోచింపజేస్తుంది.
ప్రధాని రేసులో ఉంటే గడ్కరీకి మద్దతిస్తమన్నదెవరు ?

- Advertisment -