పారాలింపిక్స్‌లో భారత్ పథకాల విజయ భేరి
ఈవెంట్స్‌లో రాణించిన అథ్లెట్లకు రూ. 22.5 లక్షలు
కేంద్ర ప్రభుత్వం నజరానా
ఢిల్లీ :
పారాలింపిక్స్ అథ్లెటిక్స్‌లో భారత్ ఘణ నీయ విజయాలు సొంతం చేసుకుంటుంది. 2016లో 4 పథకాలు సాధించగా..నేటి పారిస్ పారాలింపిక్స్‌లో 29 పథకాలు సాధించి ప్రపంచ దేశాల్లో భారత్ సత్తా చాటారు భారత్ అథ్లెట్లు. ఏడు స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు మొత్తం 29 పథకాలు సాధించడం పట్ల భారత ప్రధాని నుండి మొదలుకుని యావత్ దేశం సంతోషం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు పారాలింపిక్స్ పోటీల్లో భారత్ 50 పథకాలకు పైగా సాధించడం విశేషం. ఈ పారాలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్స్ విజేతలకు రూ.75 లక్షలు, రజత పతకంకు రూ. 50 లక్షలు, కాంస్యం విన్నర్స్‌కు రూ.30 లక్షలు చొప్పున నగదు రివార్డులు అందించనున్నట్టు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లలో రాణించిన క్రీడాకారులకు రూ. 22.5 లక్షల చొప్పున అందించనున్నట్టు ఆయన తెలిపారు. 2028లో లాస్ ఏంజెల్స్ జరిగే పారాలింపిక్స్ పోటీల్లో మన క్రీడాకారులు మరిన్ని పథకాలు సాధిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారాయన.
4 నుండి 29 వరకు..

- Advertisment -