ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మూడు రోజుల అమెరికా పర్యటన చేస్తున్నారు. ఇందులో భాగంగా డల్లాస్‌కు చేరుకున్న రాహుల్ గాంధీకి ఘన స్వాగతం లభించింది. అక్కడ ఎన్‌ఆర్‌ఐలు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు రాహుల్ గాంధీ. ఆయన మూడు రోజుల పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సోమవారం వరకు డల్లాస్‌లో, మంగళవారం వాషింగ్టన్‌లో పర్యటిస్తారు. వివిధ వర్గాలు, విద్యార్థులు, మీడియా ప్రావసీయులతో రాహుల్ గాంధీ చర్చిస్తారని ఈ సందర్భంగా ఐవోసీ చీఫ్ శామ్ పిట్రోడ ప్రకటించారు.
రాహుల్ గాంధీకి అమెరికాలో ఘన స్వాగతం

- Advertisment -