కరీంనగర్-జనత న్యూస్
మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారి తేజస్వినిపై దురుసుగా వ్యవహరించిన కేసులో కాంగ్రెస్ నాయకుడు,44వ డివిజన్ కార్పోరేటర్ భర్త మెండి చంద్ర శేఖర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మున్సిపాలిటీల్లో అధికారులతో దురుసుగా, ప్రవర్తించడంతో నిన్న వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి కోర్టులో ప్రవేశ పెట్టారు. చంద్ర శేఖర్‌పై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు అయింది. కాగా.. కరీంనగర్ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
కాంగ్రెస్ నాయకుడు చంద్ర శేకర్‌కు..14 రోజుల రిమాండ్

- Advertisment -