Wednesday, July 2, 2025

లడ్డు ఒక తిరుపతి లోనే కాదు..

తిరుపతి :
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు అనగానే..ఎవరికైనా నోరూరుతుంది. ప్రసాదం ఇక్కడ కూడా దొరికితే బాగుండు అనిపించక మానదు. భక్తుల అభిష్టం మేరకు ఇతర ప్రాంతాల్లోనూ తిరుపతి లడ్డు అందుబాటులోకి తీసుక రానుంది. టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. టీటీడీ అనుబంధ ఆలయాల్లో తిరుపతి లడ్డు లను విక్రయించేందుకు నిర్ణయించింది. ఆలయాల్లో లడ్డు ధర రూ. 50 . తిరుమల టీటీడీ నిర్ణయంతో హైదరాబాద్‌ లోని హిమాయత్‌ నగర్‌, జూబ్లీహిల్స్‌ ఆలయాల్లో తిరుపతి ప్రసాదం రోజూ అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు శని, ఆదివారాల్లో మాత్రమే విక్రయించగా, ఇక ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తిరుపతి లడ్డు విక్రయించనున్నారు. కరీంనగర్‌లోనూ టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఆలయ ప్రతిష్టాపన పూర్తయ్యాక, ఇక్కడ కూడా తిరుపతి లడ్డు ప్రసాదం అందుబాటులోకి రానుంది. తిరుపతికి వెల్లిన వారు ఎన్ని లడ్డులైనా తీసుక రావచ్చు, ఈ సదుపాయంతో పాటు హైదరాబాద్‌లోనూ అందుబాటులోకి రానుండడం పట్ల భక్తుల్లో సంతోషం వ్యక్తమౌతోంది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page