ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షులు శేఖర్‌రావు
కరీంనగర్-జనత న్యూస్
బడ్జెట్ ఉపాధ్యాయుల సంక్షేమ చట్టం బిల్లుని వేంటనే పార్లమెంట్ లో, అసెంబ్లీ లో ప్రవేశ పెట్టాలని ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయులకు రూ.10 లక్షల ఆరోగ్య భీమా, అదేవిధంగా మరో రూ.10 లక్షల జీవిత భీమా సౌకర్యాలను కల్పించాలని సూచించారు. ప్రతి సంవత్సరం 10వ తరగతిలో 10/10 జీపీఏ సాధించే విద్యార్థుల్లో 90% విద్యార్థులు ప్రయివేటు పాఠశాలల నుండే వస్తున్నారని గుర్తు చేశారు. ఎన్‌ఐటీ, ఐఐటీ, నీట్ లాంటి పోటీ పరీక్షల్లో కూడా బడ్జెట్ ప్రయివేటు పాఠశాల విద్యార్థులే ఎక్కువగాఉన్నారని తెలిపారు. నేడు 60% కి పైబడిన విద్యార్థులు చదువుతున్నది ప్రవేట్ పాఠశాలలల్లో నని, అందులోనూ బడ్జెట్ ప్రవేట్ పాఠశాల ల్లోనని పేర్కొన్నారు. ఒక భవన నిర్మాణ కార్మికుడు పనిచేస్తూ చనిపోతే రూ.లక్షల్లో జీవిత భీమా ప్రభుత్వం అందిస్తుందని, ఆ పాటి స్థాయిలో ప్రయివేటు ఉపాధ్యాయులకు రక్షణ కల్పించలేని పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు రూ.లక్షలో జీతాలు, సకల సదుపాయాలు, సర్వ సౌకర్యాలు, ఆరోగ్య భీమా, జీవిత భీమా, పదవీవిరమణ తరవాత వేలల్లో ఫింఛను అందుతుందని గుర్తు చేశారు. ఇలా అన్ని సౌకర్యాలు పొందుతున్న ఈ ప్రభుత్వ ఉపాధ్యాయల వద్ద చుదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య 40% లోపే నని..60% పైబడిన మేధావులని ఈ దేశానికి అందిస్తున్న బడ్జెట్ ప్రైవేట్ ఉపాధ్యాయులని కాపాడాలని ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు.
ప్రయివేటు ఉపాధ్యాయులకు సంక్షేమ చట్టం చేయాలి

- Advertisment -