ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీలత
కరీంనగర్-జనత న్యూస్
బాలికలు, మహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యమన్నారు కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీలత. నగరంలోని భగత్ నగర్ బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మహిళలు, యువతులు, బాలికలు వేదింపులకు గురైతే నిర్భయంగా షీ టీం లేదా ఉమెన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. కమిషనరేట్ వ్యాప్తంగా మహిళల రక్షణ కోసం షీటీమ్స్, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీంలు పనిచేస్తున్నాయని తెలిపారు. కళాశాల, పాఠశాలల విద్యార్థినులు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ లకు గురైనా, మహిళలు పని చేసే ప్రదేశాల వద్ద వేధింపులకు గురైనా, బాలికలపై ఎవరైనా లైంగిక వేధింపులకు గురైన వెంటనే నిర్భయంగా షీ టీమ్ పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. నేరుగా సంప్రదించలేని వారు 8712670759 ఫోన్ నంబరుకు లేదా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. జిల్లా గత నెలలో ఆరు (06) క్రిమినల్ కేసులు నమోదు చేశామని, 21 మందికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ చేశామని తెలిపారు. వివిధ పాఠశాలలు, కళాశాలలో, పబ్లిక్ ప్రదేశాలలో 20కి పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. 65 ప్రాంతాల్లో నిఘా ఉంచగా 11మంది పోకిరిలను పట్టుకొని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు.
మహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం

- Advertisment -