జనత :
ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారత అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయిన విషయం తెలిసిందే. మీడియాల్లో ఈ వార్త హైలైట్స్ కాగా..దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సుప్రిం కోర్టుకు క్షమాపన చెప్పారు. ఎక్స్ ఖాతాలో ఆయన పోస్టు చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం..తన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను ప్రశ్నించినట్లు ఆపాదించారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత న్యాయ వ్యవస్థపై తనకు గౌరవం, విశ్వాసనం ఉందని స్ఫష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యాంగం, దాని విలువలకు కట్టుబడి ఉంటానని, న్యాయ వ్యవస్థను ఉన్నతంగా భావిస్తానని ఎక్స్ ఖాతాల్లో ఆయన పోస్టు చేశారు. రాజకీయ పార్టీల అభిప్రాయాలతో తాము బెయిల్ ఇస్తామా..? జస్టిస్ గవాయి ధర్మాసనం ప్రశ్నించిన నేపథ్యంలో శుక్రవారం సీఎం సారీ చెప్పారు.
‘సుప్రిం’కు సీఎం సారీ
- Advertisment -