జనత డెస్క్ :
సుప్రిం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు నేపథ్యంలో ఇక ఎస్సీ, ఎస్టీ కేసుల నమోదు, దర్యాప్తును క్షేత్ర స్థాయిలో నిశితంగా పరిశీలించనున్నారు అధికారులు. ఆయా సామాజిక వర్గం వారిని ఉద్దేశ పూర్వకంగా అవమానించినట్లు విచారణలో తేలితేనే ఈ చట్టం వర్తిస్తుందని జస్టిస్ జెబీ పార్టీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్ర సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై సర్వత్రా చర్చ జరుగుతుంది. బాధితుడు ఎస్సీ, ఎస్టీ అయినప్పటికీ..సామాజిక వర్గం పేరుతో దూశించినా, వివక్ష చూపినా ఈ చట్టం వర్తించే అవకాశాలుంటాయి. కేరళకు చెందిన యూట్యూబర్ కేసులో ధర్మాసనం ఇచ్చిన తీర్పును కింది కోర్టులు సైతం అనుసరించే అవకాశాలుంటాయి. ఎస్సీ, ఎస్టీ కమీషన్ సభ్యులు, ఆయా జిల్లాల్లోని కమిటీ సభ్యులు, పోలీసు అధికారులు సైతం సుప్రిం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ముందుకు సాగే అవకాశాలుంటాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే ఆయా కోర్టుల్లో అనేక పెండిరగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణకు సుప్రిం కోర్టు ఇచ్చిన తీర్పు దిక్సూచి కానుంది.
ఇక ఎస్సీ, ఎస్టీ కేసులపై నిశిత పరిశీలన
- Advertisment -