బీఎస్‌పీ ఆఫీసులో జయంతి వేడుకలు
సర్ధార్ సర్వాయి పాపన్న పోరాటాన్ని కొనియాడారు బీఎస్‌పీ నేతలు. నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిషాని రామచంద్రం, జిల్లా ఇంఛార్జి మంద బాలయ్య తదితరులు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఉమ్మడి వరంగల్ జిల్లా ఖిలాషాపూర్ గ్రామంలో ఆగస్టు 18,1650 లో కల్లు గీత గౌడ కులం లో జన్మించిన సర్వాయి పాపన్న…నాటి గోల్కొండ పాలకులు కుతుబ్ షాహి రాజుల ఆగడాలను సహించలేక వారిపై పోరాడి బహుజన రాజ్యం తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో బీఎస్‌పీ కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జ్ కత్తెరపాక రమేష్, కరీంనగర్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సిరిసిల్ల అంజయ్య, గన్నేరువరం మండల అధ్యక్షులు బామాండ్ల ఎల్లయ్య, మానకొండూర్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి గుర్రం సత్యనారాయణ, తిమ్మాపూర్ మండల ప్రధాన కార్యదర్శి కవ్వంపెల్లి సంపత్, పార్టీ సీనియర్ నాయకులు హృదయ్ పాల్గొన్నారు.
యువతకు స్ఫూర్తి సర్ధార్ సర్వాయి పాపన్న..
- Advertisment -